కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు: నన్నపనేని

హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తెదేపా సీనియర్‌ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఖండించారు.

Published : 28 Sep 2023 05:40 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తెదేపా సీనియర్‌ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఖండించారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు నిరసన తెలిపే హక్కు దేశంలో ఎక్కడివారికైనా ఉంటుందన్నారు. ప్రపంచంలో వివిధ చోట్ల నిరసనలు చేసినట్లే హైదరాబాద్‌లోనూ చేశారని పేర్కొన్నారు. తెరాసను భారాసగా మార్చి వారు ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఒంగోలులో బుధవారం చేపట్టిన నిరాహార దీక్షా శిబిరం వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని