తెదేపా, వైకాపాల అంతమే భాజపా లక్ష్యం

ఏపీలో తెదేపా, వైకాపాల్ని అంతం చేసేందుకు భాజపా సుదీర్ఘ ప్రణాళికతో ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు.

Published : 28 Sep 2023 05:40 IST

మోదీతో లేకపోతేనే చంద్రబాబు, పవన్‌లతో కలుస్తాం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఈనాడు, చెన్నై: ఏపీలో తెదేపా, వైకాపాల్ని అంతం చేసేందుకు భాజపా సుదీర్ఘ ప్రణాళికతో ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. చెన్నైలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు పరిణామాలు మోదీ, అమిత్‌ షాల ఆజ్ఞలతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో తొలుత తెదేపాను అంతం చేసి, తరువాత వైకాపాను అదేబాట పట్టించాలనేది భాజపా ఆలోచనగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు భాజపాతో ఉంటారా.. లేదా అనేది తేల్చుకున్న తర్వాతే తాము వారితో కలిసి ఉండాలా, వద్దా అనేది నిర్ణయించుకుంటామని వెల్లడించారు. వారు భాజపాతో వెళ్తే.. తాము వేరుగా బరిలోకి దిగుతామన్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. భాజపా అండతోనే జగన్‌ పదేళ్లపాటు బెయిల్‌పై ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘ఇండియా’ కూటమి రోజురోజుకూ బలపడుతోంటే.. ఎన్డీయే బలహీనపడుతోందని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ ‘జై భజరంగదళ్‌’, ‘సనాతనం’ నినాదాల్ని తీసుకున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని