జగన్‌ మళ్లీ ఎందుకు? రాష్ట్రాన్ని వెనక్కి నెట్టినందుకా?

నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టి.. సిగ్గు లేకుండా మళ్లీ జగనే కావాలంటూ ప్రచారం చేయిస్తారా? అంటూ మాజీ మంత్రి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు.

Published : 28 Sep 2023 05:40 IST

మాజీ మంత్రి కళా వెంకట్రావు ధ్వజం

ఈనాడు, అమరావతి: నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టి.. సిగ్గు లేకుండా మళ్లీ జగనే కావాలంటూ ప్రచారం చేయిస్తారా? అంటూ మాజీ మంత్రి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. ‘వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 3 స్థానాలకు మించి రావని సర్వేలో తేలింది. దీంతో జగన్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ 175 స్థానాల్లో గెలుపు పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైకాపా జడ్పీటీసీ, సర్పంచులు తెదేపాలో చేరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కిడ్నాప్‌ చేయడానికి కూడా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారని దుయ్యబట్టారు. ‘ఆంధ్రాకి జగన్‌ ఎందుకు కావాలి..? 2.13 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసినందుకా? కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేసినందుకా? మద్య నిషేధమని మాట తప్పి.. నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నందుకా? తనపై ఉన్న కేసుల మాఫీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. రాష్ట్రానికి ద్రోహం చేసినందుకా? సీపీఎస్‌ రద్దు పేరుతో ఉద్యోగుల్ని మోసం చేసినందుకా?’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని