చంద్రబాబు బయటకు రాకుండా జగన్‌ ప్రయత్నాలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు ఊరట లభించకూడదన్న పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారని.. సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల తీరే అందుకు నిదర్శనమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Published : 28 Sep 2023 05:40 IST

తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు, అమరావతి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు ఊరట లభించకూడదన్న పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారని.. సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల తీరే అందుకు నిదర్శనమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించేందుకు సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై ఒత్తిడి తెచ్చి, వ్యక్తిగత కారణాలతో బెదిరించారన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘బుధవారం సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు న్యాయమూర్తి నాట్‌ బిఫోర్‌ మీ అన్నారు. తర్వాత చీఫ్‌ జస్టిస్‌ దగ్గరకు చంద్రబాబు న్యాయవాది లూథ్రా వెళ్లినప్పుడు.. ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు కూడా ఆయన వెంట పరుగులు తీశారు. వారిలోని ఉత్సాహం, ఆతృతను ఇది తెలియజేస్తోంది. ఇంత కక్ష కట్టి, వెంటపడిన దాఖలాలు ఎప్పుడూ లేవు’ అని రామయ్య తెలిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ను కూడా పక్కనపెట్టి, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో ఉన్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌కు బాధ్యతలు అప్పగించడమే జగన్‌ ఫ్యాక్షన్‌ విధానాలకు నిదర్శనమని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని