రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు

తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి తెదేపా నేత, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌ అట్లూరి నారాయణరావు వివరించారు.

Published : 28 Sep 2023 05:43 IST

పళనిస్వామిని కలిసి వివరించిన తెదేపా నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి తెదేపా నేత, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌ అట్లూరి నారాయణరావు వివరించారు. విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన పళనిస్వామిని బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పూర్వాపరాలు, జగన్‌ కక్ష సాధింపు విధానాల్ని ఆయనకు వివరించినట్టు అట్లూరి తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని