దళితుల నుంచి తీసుకున్న భూములు తిరిగివ్వాలి: కోదండరెడ్డి

దళితులకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూములను భారాస సర్కారు బలవంతంగా లాక్కుని.. పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటోందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు.

Updated : 03 Oct 2023 06:40 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దళితులకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూములను భారాస సర్కారు బలవంతంగా లాక్కుని.. పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటోందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. దళితుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. నాయకులు వీహెచ్‌, మధుయాస్కీ, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్‌, అద్దంకి దయాకర్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా కేటీఆర్‌, హరీశ్‌, కవిత: మల్లు రవి.. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత.. బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ముగ్గురినీ ఘనంగా సన్మానిస్తామన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని