మద్యం విక్రయాల్లో వికృత కళ

మద్యం తయారీ, విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వికృత కళను ప్రదర్శిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు.

Updated : 03 Oct 2023 06:16 IST

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ పురందేశ్వరి

ఈనాడు, అమరావతి: మద్యం తయారీ, విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వికృత కళను ప్రదర్శిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆమె నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే కేసులు నమోదుచేసి, జైళ్లలో పెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డబ్బు కోసం నాణ్యత లేని మద్యాన్ని ప్రభుత్వం విక్రయిస్తోంది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఆదాయ కోణంలోనే దాన్ని చూస్తోంది. గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. మౌలిక సదుపాయాలు, రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది’ అని పేర్కొన్నారు. అవనిగడ్డలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రసంగాన్ని తాను చూడలేదని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తాను రెండేళ్ల కిందట ఈ విషయంపై మాట్లాడితే సామాజిక మాద్యమాల్లో వివిధ రకాలుగా ట్రోల్‌ చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని