మా పార్టీకి 15 సీట్లకు మించి రావు: రఘురామకృష్ణరాజు

రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 15 సీట్లకు మించి రావని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతానికి తమ పార్టీ 15 సీట్ల వద్ద ఉందని, అక్టోబరు 11న సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ అనంతరం మరింతగా దిగజారవచ్చన్నారు.

Updated : 03 Oct 2023 05:39 IST

ఈనాడు, దిల్లీ: రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 15 సీట్లకు మించి రావని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతానికి తమ పార్టీ 15 సీట్ల వద్ద ఉందని, అక్టోబరు 11న సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ అనంతరం మరింతగా దిగజారవచ్చన్నారు. దిల్లీలో ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణార్జునులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు అయితే ఆ సమయానికి తనలాంటి భీముడు వారి వెంటే ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ పంపించకపోయినా తానే పార్టీ వదిలి వెళ్లిపోతానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని