నెమ్మదించినా.. సంప్రదింపులు ఆగలేదు
విపక్ష ఇండియా కూటమి కార్యకలాపాలు నెమ్మదించిన మాట వాస్తవమే అయినప్పటికీ పూర్తిగా నిలిచిపోలేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది.
చిక్కుముళ్లు తొలగించే యత్నం జరుగుతోంది
ఇండియా కూటమికి ఎదురవుతున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు
విపక్ష ఇండియా కూటమి కార్యకలాపాలు నెమ్మదించిన మాట వాస్తవమే అయినప్పటికీ పూర్తిగా నిలిచిపోలేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. ఉమ్మడి సమావేశాలు నిర్వహించకున్నా.. తెరవెనుక సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఇండియా కూటమి తలపెట్టిన భోపాల్ ర్యాలీ రద్దయింది. అంతేగాక సంయుక్త సమావేశాలు, కార్యక్రమాలూ నిర్వహించడం లేదు. ఈ పరిస్థితుల్లో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల పంపకంలో పార్టీల మధ్య సయోధ్య కుదరలేదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటిపై కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ స్పందించింది. ఇండియా కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని.. వాటిని పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని ఏఐసీసీ సమన్వయ కర్త సయ్యద్ నజీర్ హుస్సేన్ ‘ఈటీవీ భారత్’కు చెప్పారు.
రాష్ట్రాల స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి
‘మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి వాళ్లు త్వరలో ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల నాయకత్వం కూడా ఎన్నికల పనుల్లో విశ్రాంతి లేకుండా ఉంది. ఈ కారణంగా ఇండియా కూటమి నెమ్మదించిందని అనుకోలేం. సీనియర్ నాయకులు లేనంత మాత్రాన సమాంతర సమావేశాలు నిర్వహించలేమని కాదు. సీట్ల పంపకం గురించి, సోషల్ మీడియా వ్యూహాలు, ఉమ్మడి ప్రచారాలు వంటి అంశాలపై తెరవెనుక సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా కూటమి ఒక పార్టీతో కేంద్రీకృతం కానందున.. ఇలాంటి సంప్రదింపులు ఎక్కువగా రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. గత నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా దిల్లీలో అనేక సంప్రదింపులు జరిగాయి’ అని ఏఐసీసీ సమన్వయకర్త సయ్యద్ నజీర్ హుస్సేన్ తెలిపారు. ‘ఇండియా కూటమి నాయకులు ఒక నిర్దిష్ట నగరంలో లేరు. దీనివల్ల వారు మీడియాతో కలిసి మాట్లాడలేకపోతున్నారు. అంత మాత్రాన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని కాదు. ఫోన్, కాన్ఫరెన్స్ కాల్స్, జూమ్ సమావేశాల ద్వారా చాలా సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రతి సమాచారం మీడియాకు తెలియాలని లేదు. చర్చలు పూర్తైన తర్వాత మేము కచ్చితంగా అధికారిక ప్రకటన చేస్తాం’ అని ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సుప్రియా శ్రినేత్ ‘ఈటీవీ భారత్’కు వివరించారు.
వనరులు చాలడం లేదు!
‘బహిరంగ సభ ప్లాన్ చేస్తే లక్ష నుంచి రెండు లక్షల మందిని సమీకరించాలి. అలాంటి సమయంలో మన వద్ద ఉన్న వనరుల అంశం ప్రస్తావనకు వస్తుంది. వనరులు లేనప్పుడు ఉమ్మడి ర్యాలీని ఎవరు నిర్వహిస్తారు. దీంతో పాటు సీనియర్ నేతలు కూడా అందుబాటులో ఉండేటట్టు కసరత్తు చేయాలి. అయితే, ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు ఆయన చెప్పారు. వాటిని పరిష్కరించి ఏకాభిప్రాయాన్ని సాధించాలని.. ఇంకా ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోందని చెప్పారు. బిహార్‌లో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో సీట్ల పంపకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు. 80 సీట్లు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ బాధ్యత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీసుకున్నారు. 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో సామరస్య పంపిణీకి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కృషి చేస్తున్నారు. ఈ పనిని సమన్వయ కమిటీ పర్యవేక్షిస్తుండటం వల్ల కూటమికి ఛైర్పర్సన్, కన్వీనర్‌ను నియమించడం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ కూటమికి ప్రధాన కార్యాలయం కూడా ఇంకా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం కూటమికి సహాయం అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nara Lokesh: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్
రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. -
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. -
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది. -
అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. -
15 మందిలో 10 మంది వారే
ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. -
పర్చూరు వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు పెరిగాయి. -
వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలే
ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు. -
132 ఓట్ల తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఓటర్ల జాబితాలో అక్రమాలపై విచారణ చేపట్టండి
జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. -
మంత్రి బొత్స ఇలాకాలోని జాబితాలో మృతుల పేర్లు
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అప్పుల్లో దేశంలోనే నంబర్-1 గా ఏపీ
రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. -
మట్కా, బెట్టింగ్ ఆడేవారిని ఉరేస్తారా?
మట్కా, క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. -
అయిదు రాష్ట్రాల్లో.. 18% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. -
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూబకాసురులు ఎవరు?
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్‌కుమార్ ప్రశ్నించారు. -
ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇంకెవరూ లేరా?
ఒక సామాజికవర్గానికి చెందిన వారే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం వెనకున్న ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన మండలాధ్యక్షులు
నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. -
అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ: నాగబాబు
తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పేర్కొన్నారు. -
ఓబీసీ జాబితాలో తూర్పుకాపులను చేర్చడానికి ఎన్సీబీసీ సిఫార్సు: ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
Osprey aircraft: జపాన్ సముద్రంలో కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
-
Rushikonda: రుషికొండ తవ్వకాలపై పిల్.. హైకోర్టులో విచారణ
-
BCCI: వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు
-
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?
-
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. ‘రో-కో’ జోడీ అన్ని సిరీస్‌లకు అందుబాటులో ఉండదా..?