Sai Prasad Reddy: ‘నిజంగానే ఉరేసుకుంటే సరిపోతుంది కదా!’

‘చంద్రబాబు విడుదల కావాలని తెదేపా నాయకులు గుండు గీయించుకుంటున్నారు, పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారు, ఉరితాళ్లు మెడకు బిగించుకుని పోజులిస్తున్నారు.

Updated : 03 Oct 2023 09:05 IST

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ‘చంద్రబాబు విడుదల కావాలని తెదేపా నాయకులు గుండు గీయించుకుంటున్నారు, పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారు, ఉరితాళ్లు మెడకు బిగించుకుని పోజులిస్తున్నారు అదేదో నిజంగా ఉరేసుకుంటే సరిపోతుంది కదా’ అని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదోనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని.. వీరి దీక్షలను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని, తామూ గుర్తించడం లేదన్నారు. ఆదోనిలో బూటు కాలితో తన్నే పోలీస్‌ అధికారులు ఎవరూ లేరని, కేవలం సానుభూతి కోసం ఆ పార్టీ నాయకుడు భాస్కర్‌రెడ్డి చెప్పుకొంటున్నారన్నారు. పశువులకు ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు కట్టి అనుమతి లేకుండా ఊరేగిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. తాము సైతం పోలీసుల అనుమతి తీసుకునే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని