చంద్రబాబుతో అమిత్‌ షా భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ భాజపా వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌లకు తెదేపా అధినేత    చంద్రబాబు మంగళవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా విందు ఏర్పాటు చేశారు.

Published : 12 Jun 2024 05:00 IST

అమిత్‌షా, జేపీ నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు, పురందేశ్వరి తదితర నాయకులు 

ఈనాడు-అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ భాజపా వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌లకు తెదేపా అధినేత  చంద్రబాబు మంగళవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు, భాజపా నుంచి ఎవరెవరికి చోటు కల్పించాలి.. తదితర అంశాలపై చర్చించారు. అంతకుముందు విమానాశ్రయంలో అమిత్‌ షా, నడ్డాలకు ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని