ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మళ్లీ ఎన్టీఆర్‌ పేరు పెట్టాలి: తెదేపా నేతలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయ భవనానికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయం పేరుతో ఉన్న బోర్డుపై ఎన్టీఆర్‌ కార్యాలయం పేరుతో ఉన్న ఫ్లెక్సీని తెదేపా నేతలు ఏర్పాటు చేశారు.

Published : 12 Jun 2024 05:03 IST

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ పేరు ఉన్న బోర్డుపై ఎన్టీఆర్‌ వైద్యసేవ
కేంద్ర కార్యాలయం పేరుతో ఉన్న ఫ్లెక్సీని పెడుతున్న తెదేపా నాయకులు

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయ భవనానికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయం పేరుతో ఉన్న బోర్డుపై ఎన్టీఆర్‌ కార్యాలయం పేరుతో ఉన్న ఫ్లెక్సీని తెదేపా నేతలు ఏర్పాటు చేశారు. దీనికి ఎన్టీఆర్‌ పేరు మళ్లీ పెట్టాలని, ఇకపై ఇది ఎన్టీఆర్‌ పేరుతో కొనసాగుతుందని వారు నినాదాలు చేశారు. గతంలో ఎన్టీఆర్‌ పేరుతో ట్రస్టు కార్యకలాపాలు కొనసాగాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఉన్న ఎన్టీఆర్‌ పేరు తొలగించి, వైఎస్సార్‌ పేరు పెట్టింది. ఇప్పుడు ఎన్డీయే అధికారం చేపట్టబోతుంది. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డుపై ఉన్న వైఎస్‌ బొమ్మ, అక్షరాలు తొలగించి, ఎన్టీఆర్‌ వైద్య సేవ కేంద్ర కార్యాలయం పేరుతో తయారుచేసిన ఫ్లెక్సీని స్థానిక తెదేపా నేతలు మంగళవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తలపునేని వెంకటాద్రి, పొదిలి వాసు, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని