విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: ఎంపీ మల్లు రవి

రాష్ట్ర విభజన హామీల సాధన కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 12 Jun 2024 05:09 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన హామీల సాధన కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లైనా విభజన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై పార్లమెంటులో కొట్లాడుతామని చెప్పారు. 

తప్పుడు ప్రచారం మానుకోవాలి: బల్మూరి వెంకట్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భారాస నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సూచించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియాహాల్‌లో మాట్లాడారు. రాష్ట్ర చిహ్నం, టీఎస్‌ నుంచి టీజీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందంటూ భారాస నేతలు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ‘నీట్‌’ అవకతవకలపై హైదరాబాద్‌ వేదికగా నిరసనకార్యక్రమం చేపడతామని వెంకట్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని