కోడ్‌ ముగిసినా హామీల అమలు జాడలేదు: మహేశ్వర్‌రెడ్డి

ఎన్నికల కోడ్‌ ముగిసినా హామీల అమలు జాడ మాత్రం లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అంశాన్ని దాటవేస్తోందని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 12 Jun 2024 05:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ ముగిసినా హామీల అమలు జాడ మాత్రం లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అంశాన్ని దాటవేస్తోందని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి వాటి ఊసే లేకుండా కాంగ్రెస్‌ నాయకులు కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే హామీల అమలుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ 8 ఎంపీ సీట్లు గెలిస్తే, 8మంది ఎమ్మెల్యేలు ఉన్న భాజపా కూడా 8 లోక్‌సభ సీట్లను గెలుచుకుందని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా చేసే ప్రయత్నాలను భాజపా అడ్డుకుంటుందని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని