లోక్‌సభ స్పీకర్‌ పదవిని మీలో ఎవరో ఒకరు తీసుకోండి

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జేడీయూలకు చెందిన ఎవరో ఒకరు లోక్‌సభ స్పీకర్‌ బాధ్యతలను చేపట్టాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కోరింది.

Published : 12 Jun 2024 05:22 IST

తెదేపా, జేడీయూలకు ఆప్‌ సూచన

దిల్లీ: ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జేడీయూలకు చెందిన ఎవరో ఒకరు లోక్‌సభ స్పీకర్‌ బాధ్యతలను చేపట్టాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కోరింది. ఆ పార్టీలతోపాటు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రయోజనాల దృష్ట్యా ఆ చర్య అవసరమని సూచించింది. భాజపా మద్దతులేకుండా తెదేపా స్పీకర్‌ అభ్యర్థిని నిలబెడితే ఆ ఎన్నికలో ప్రతిపక్ష ఇండియా కూటమి ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. ఎన్డీయే భాగస్వాములకు తక్కువ ప్రాధాన్యం కలిగిన మంత్రిపదవులు కట్టపెట్టిన భాజపా.. ప్రాధాన్యత శాఖలను తనే అట్టిపెట్టుకుందని విమర్శించారు. ఈ క్రమంలోనే తెదేపా, జేడీయూ వంటి పార్టీలు కనీసం స్పీకర్‌ పదవినైనా దక్కించుకోవాలన్నారు. అది ఆయా పార్టీల, రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రయోజనాలను పరిరక్షిస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని