‘అసంతృప్త ఆత్మలు’గా చంద్రబాబు, నీతీశ్‌: సంజయ్‌రౌత్‌

కేంద్ర మంత్రిమండలిలో తమకు దక్కిన శాఖలపై భాజపా మిత్రులైన చంద్రబాబు, నీతీశ్‌ కుమార్‌ ‘అసంతృప్త ఆత్మ’లతో ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ మంగళవారం పేర్కొన్నారు.

Updated : 12 Jun 2024 06:39 IST

ముంబయి: కేంద్ర మంత్రిమండలిలో తమకు దక్కిన శాఖలపై భాజపా మిత్రులైన చంద్రబాబు, నీతీశ్‌ కుమార్‌ ‘అసంతృప్త ఆత్మ’లతో ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ మంగళవారం పేర్కొన్నారు. ఎన్సీపీ-ఎస్పీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను ఉద్దేశించి ‘విశ్రాంతి లేని ఆత్మ సంచరిస్తోంది’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ భాజపా నేతృత్వంలోని ప్రభుత్వాలను సాగనంపేదాకా విశ్రాంతి ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం పనిచేయడంలేదని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ భావిస్తే ఆ ప్రభుత్వాన్ని దించేయాలని సంజయ్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని