చంద్రబాబు, నీతీశ్‌ తెలివైనవారు: తరుణ్‌ గొగొయ్‌

తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌లు తెలివైన నాయకులని, ఎన్డీయే కూటమిలో ఉన్న వారిద్దరి అసలు ఉద్దేశాలేమిటనేది కాలమే చెబుతుందని నూతన ఎంపీ, మునుపటి లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష ఉపనాయకుడిగా వ్యవహరించిన తరుణ్‌ గొగొయ్‌ అన్నారు.

Published : 12 Jun 2024 05:25 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌లు తెలివైన నాయకులని, ఎన్డీయే కూటమిలో ఉన్న వారిద్దరి అసలు ఉద్దేశాలేమిటనేది కాలమే చెబుతుందని నూతన ఎంపీ, మునుపటి లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష ఉపనాయకుడిగా వ్యవహరించిన తరుణ్‌ గొగొయ్‌ అన్నారు. వారిద్దరూ తమతమ డిమాండ్లపై గట్టిగా పట్టుబిగిస్తే వాటికి తలొగ్గేంత విశాల హృదయం ప్రధానికి ఉంటుందా అని ‘పీటీఐ’ వార్తాసంస్థ ముఖాముఖిలో ప్రశ్నించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కిరణ్‌ రిజిజుకు కేటాయించడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. గత దశాబ్దకాలం కంటే భిన్నంగా పార్లమెంటు పనిచేయాలని ప్రధాని కోరుకుంటున్నా అలాంటి నమ్మకం కలిగించలేనిరీతిలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు మంత్రి, సహాయ మంత్రిని నియమించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ‘ఎక్స్‌’లో విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని