Chandrababu: 1995లో తోడల్లుడు.. ఇప్పుడు వదిన

అది 1995 సంవత్సరం.. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భం..

Updated : 12 Jun 2024 09:15 IST

చంద్రబాబు, పురందేశ్వరి ఆత్మీయ పలకరింపు

అమరావతి: అది 1995 సంవత్సరం.. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భం.. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు పేరును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. ఇప్పుడు 2024.. అంటే 29 ఏళ్ల తర్వాత.. చంద్రబాబును ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా బలపరుస్తున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, చంద్రబాబు వదిన, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని