యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయారెడ్డి

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నియమితులయ్యారు.

Published : 13 Jun 2024 04:19 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ ప్రకటించారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శులుగా మహేందర్‌ ఛెడ్, మహ్మద్‌ అద్నాన్‌లను నియమించారు. వీరితో పాటు పలు జిల్లాలకు యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమిస్తూ శ్రీనివాస్‌ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని