ఏక వ్యక్తి పాలనకు ప్రజల చరమగీతం: శరద్‌ పవార్‌

ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చాటిచెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ అన్నారు.

Published : 13 Jun 2024 04:45 IST

పుణె: ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చాటిచెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. దేశంలో ఏక వ్యక్తి పాలనకు వారు చరమగీతం పాడారంటూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిని ఓడించడం ద్వారా.. మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించబోమని ఓటర్లు చెప్పకనే చెప్పారన్నారు. ప్రజలు రాజకీయాలు, మత విశ్వాసాలను కలిపి చూడరని తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నారు. బారామతి లోక్‌సభ స్థానం పరిధిలోని పురందర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో పవార్‌ ఈ మేరకు మాట్లాడారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని