ప్రమాణ స్వీకార వేదికపై అమిత్‌ షా, తమిళిసై సీరియస్‌ సంభాషణ!

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 13 Jun 2024 05:36 IST

నెట్టింట వీడియో వైరల్‌

ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తమిళిసై.. వేదికపై కూర్చున్న నేతలను పలకరిస్తూ ముందుకు వెళ్లారు. అక్కడే ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్‌ షాను ఆమె పలకరించారు. తర్వాత ఆమె అక్కడి నుంచి ముందుకువెళ్తుంటే.. అమిత్‌ షా వెనక్కి పిలిచారు. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అది కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు కనిపించింది. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని