అవినీతి పాలనను అంతమొందించారు: పురందేశ్వరి

గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

Published : 13 Jun 2024 05:36 IST

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమాన్ని విస్మరించిన వారికి ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం హెచ్చరికలాంటిదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని