కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులా?: శ్రవణ్‌

పగలు, ప్రతీకారాలకు, రాజకీయ కుయుక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి పాలన పరాకాష్ఠగా మారిందని భారాస నేత దాసోజు శ్రవణ్‌ విమర్శించారు.

Published : 14 Jun 2024 04:37 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: పగలు, ప్రతీకారాలకు, రాజకీయ కుయుక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి పాలన పరాకాష్ఠగా మారిందని భారాస నేత దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి కరెంటు లోటుతో సతమతమవుతుండగా.. మిగులు విద్యుత్‌తో వెలుగులు విరజిమ్మేలా.. నిరంతర విద్యుత్‌ అందేలా తీర్చిదిద్దినందుకు కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులిస్తారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. ప్రతీకార రాజకీయాలను పక్కనపెట్టి ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని