కేసీఆర్, హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ: రఘునందన్‌రావు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని.. ఆయనతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలకు ముసళ్ల పండగ ముందుందని మెదక్‌ భాజపా ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.

Published : 14 Jun 2024 04:38 IST

మెదక్‌ అర్బన్, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని.. ఆయనతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలకు ముసళ్ల పండగ ముందుందని మెదక్‌ భాజపా ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారి మెదక్‌కు వచ్చిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉద్యమకారులకు కాకుండా.. డబ్బున్న వారికే భారాస టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికల్లో మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. అయినా ఆ లోక్‌సభ సీటును గెలిచి ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చామన్నారు. అజంతా ఎక్స్‌ప్రెస్‌ రైలును అక్కన్నపేట, చేగుంటలో నిలిపేలా దక్షిణ మధ్య రైల్వే జీఎంకు విన్నవిస్తానని తెలిపారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని