రాజ్యసభ బరిలో సునేత్రా పవార్‌

మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన సునేత్రా పవార్‌ (ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ భార్య) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు.

Published : 14 Jun 2024 05:01 IST

ముంబయి: మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన సునేత్రా పవార్‌ (ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ భార్య) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థిగా గురువారం ఆమె నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అజిత్‌ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీలవారెవరూ దీనికి హాజరుకాలేదు. తాను రాజ్యసభకు పోటీచేయాలని అనుకున్నా సునేత్ర నామినేషన్‌తో ఏమాత్రం నిరుత్సాహపడలేదని, అది పార్టీ ఉమ్మడి నిర్ణయమని మహారాష్ట్ర మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు