పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం

పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై ఎక్స్‌ వేదికగా గురువారం ఆయన స్పందించారు.

Updated : 14 Jun 2024 05:27 IST

 ఎక్స్‌లో సీఎం చంద్రబాబు సందేశం

ఈనాడు డిజిటల్, అమరావతి: పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై ఎక్స్‌ వేదికగా గురువారం ఆయన స్పందించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేపట్టే పరివర్తన యాత్రలో పాల్గొనాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు. ‘ఐదేళ్లుగా రాష్ట్రానికి తగిలిన గాయాల వల్ల వ్యవస్థల పట్ల నమ్మకం పోయింది. తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్ని అసమానతలను అధిగమించి, ప్రజల విశ్వాసాన్ని పొందాం. నిబద్ధత గల పార్టీ కార్యకర్తలు, సామాజిక మాధ్యమ యోధుల నుంచి శుభాకాంక్షలు స్వీకరించడం సంతోషంగా ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని