రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టి కృషి

రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టిగా కృషి చేద్దామని జనసేన నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో కోరారు.

Published : 14 Jun 2024 05:03 IST

 మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టిగా కృషి చేద్దామని జనసేన నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో కోరారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మంత్రి పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘పార్టీ శ్రేణులు అంకితభావంతో, నిస్వార్థంగా క్షేత్రస్థాయిలో అండగా నిలిచి మరచిపోలేని విజయాన్ని అందించారు. సమన్వయంతో పనిచేసిన తెదేపా, భాజపా నాయకులకు ధన్యవాదాలు. తెనాలి నియోజకవర్గ ప్రజలు అందించిన అమూల్యమైన ప్రోత్సాహానికి, అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని మనోహర్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని