విజయసాయి విచారణ ఎదుర్కోవాల్సిందే: బుద్దా వెంకన్న

ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న హెచ్చరించారు.

Published : 14 Jun 2024 05:04 IST

ఈనాడు, అమరావతి: ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులైనా కాలేదని, అప్పుడే వైకాపా శ్రేణులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు నెత్తీనోరూ బాదుకోవడం విచిత్రంగా ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే, ఒక్క అధికారిని కూడా బదిలీ చేయకుండానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైకాపా నాయకులు కొత్త పల్లవి అందుకోవడం.. వారి ప్రవర్తనకు అద్దం పడుతుందన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే పాలనలో కక్ష సాధింపులు ఉండబోవని సీఎం చంద్రబాబు, మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే చెప్పారు. అలాగని తప్పుచేసిన వారిని వదిలేస్తారన్న భ్రమలో ఉండొద్దు. మాపై ఫిర్యాదు చేస్తున్న విజయసాయిరెడ్డికి కొడాలి నాని, వల్లభనేని వంశీ మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు కన్పించలేదా? మా పార్టీ కార్యాలయంపై దాడులు చేసినప్పుడు ఏం చేశారు? పల్నాడులో మాపై హత్యాయత్నం చేస్తే ఏమయ్యారు? చంద్రబాబు ఇంటిపై కర్రలతో వచ్చి, చెప్పులు విసిరితే.. భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ చిలకపలుకులు పలకలేదా?’ అని వెంకన్న ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని