దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ

‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు.

Published : 14 Jun 2024 05:19 IST

కాళ్ల, న్యూస్‌టుడే: ‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. గతంలో వారు చేసినట్లు ఎన్డీయే పాలనలోనూ దాడులకు పాల్పడతారన్న భయంతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నార’ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టి, పట్టపగలే ఇంట్లోంచి ఎత్తుకెళ్లి అర్ధరాత్రి వరకూ తిప్పుతూ కొట్టారు. దీనిపై ఆధారాలున్నా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసిన వారు.. నేడు ఏమీ జరగకముందే ఏదో జరిగిపోతోందన్న అపోహతో ముందుగానే తమని కొడుతున్నారని, చంపేస్తున్నారని పెడబొబ్బలు పెడుతున్నార’ని రఘురామ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని