ఎన్నికల ఫలితాలపై భాజపా సమీక్ష

వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్‌సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమీక్షలు జరిగాయి.

Published : 14 Jun 2024 05:06 IST

 పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నేతల సూచన 

ఈనాడు, అమరావతి: వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్‌సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమీక్షలు జరిగాయి. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో కసి కనిపించిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. వైకాపా పాలనలోని ఘోర తప్పిదాలకు ప్రజలు నిశ్శబ్ద ఓటింగ్‌ ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇటువంటి తప్పిదాలు మనవైపు నుంచి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలపడినట్లే, సంస్థాగతంగానూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాల్లోని పరిస్థితులపైనా సమీక్షించారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీలోని జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో విభాగాల వారీగా జరిగిన కృషిని నివేదిక రూపంలో అందజేయాలని, వీటిని కేంద్ర నాయకత్వానికి పంపిస్తామని చెప్పారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, పార్టీ నూతన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని