మెగా డీఎస్సీపై తొలి సంతకం హర్షణీయం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌లు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Published : 14 Jun 2024 05:06 IST

 తెదేపా ఎమ్మెల్సీలు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌లు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చారు: కంభంపాటి రామమోహన్‌రావు

బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే మెగా డీఎస్సీ నిర్వహణ, సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు తదితర హామీల అమలుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు పెట్టినందుకు సీఎం చంద్రబాబుకు తెదేపా ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నేత చంద్రబాబు అని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని