పింఛన్ల పెంపు గొప్ప విషయం: రామకృష్ణ

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 14 Jun 2024 05:54 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై సంతకం చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లను రూ.4 వేలకు పెంచడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే ప్రతి అంశానికీ సంపూర్ణంగా మద్దతిస్తాం. ప్రజా సమస్యలపై నిలదీయడానికి కూడా సిద్ధం’ అని రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ కలిశారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని