ప్రజాపాలన మొదలు.. సీఎంగా చంద్రబాబు రాకతో మంచిరోజులు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ వచ్చిందని తెదేపా సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్దన్‌ తెలిపారు.

Updated : 14 Jun 2024 05:53 IST

 తెదేపా నేతల హర్షం 

ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ వచ్చిందని తెదేపా సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్దన్‌ తెలిపారు. ఇకపై రాష్ట్రానికి అన్నీ మంచిరోజులేనని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి గురువారం బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘అయిదేళ్లుగా రాష్ట్రంలో సాగిన అరాచక, అప్రజాస్వామ్య పాలన అంతమై ప్రజాపాలన మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీలైన మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సీఎం సంతకాలు చేశారు. ఏటా వచ్చే దీపావళి కంటే గురువారం రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకమైంది’ అని వర్ల రామయ్య తెలిపారు. టీడీ జనార్దన్‌ మాట్లాడుతూ.. ‘ఇన్ని రోజులూ ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. అక్రమ కేసులు బనాయించి ఏ క్షణాన ఎవర్ని అరెస్టు చేస్తారోనని భయంతో జీవించారు. ఇకపై అలా ఉండదు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని