సంపన్న రాష్ట్రంగా చేద్దాం

‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం.

Published : 15 Jun 2024 06:22 IST

మీతో కలిసి కృషి చేయడానికి నిరీక్షిస్తున్నా
సీఎం చంద్రబాబు ట్వీట్‌కు స్పందించిన పవన్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. శక్తిమంతమైన, సంపన్న ఆంధ్రప్రదేశ్‌ను సాకారం చేయడంలో మీతో కలిసి వెళ్లడానికి ఎదురుచూస్తున్నా..’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఉపముఖ్యమంత్రి పవన్‌కు అభినందనలు తెలిపారు. దీనికి పవన్‌ స్పందిస్తూ.. చంద్రబాబును ఉద్దేశించి రీట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని