నీట్‌ను.. ‘ఛీట్‌’గా మార్చేశారు

నీట్‌ పరీక్ష అంశంపై ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నీట్‌ను కేంద్రం ‘ఛీట్‌’(మోసం)గా మార్చేసిందని ఆక్షేపించింది.

Published : 15 Jun 2024 05:35 IST

మోదీపై కాంగ్రెస్‌ ధ్వజం

దిల్లీ: నీట్‌ పరీక్ష అంశంపై ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నీట్‌ను కేంద్రం ‘ఛీట్‌’(మోసం)గా మార్చేసిందని ఆక్షేపించింది. ‘‘పేపర్‌ లీక్‌ కాకపోతే బిహార్‌లో 13 మంది నిందితులను ఎంద]ుకు అరెస్టు చేశారు? పేపర్ల కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు పట్నా పోలీస్‌ ఆర్థిక నేరాల యూనిట్‌ బయటపెట్టలేదా’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ.. మోదీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా తప్పుపట్టారు. నీట్‌ వ్యవహారాన్ని. మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘వ్యాపమ్‌ 2.0’ కుంభకోణంతో పోల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని