రాష్ట్ర ప్రభుత్వ హామీలు నీటి మూటలే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్‌ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, 190 రోజులు దాటినా ఆచరణలో విఫలమైందని ఆరోపించారు.

Updated : 15 Jun 2024 05:52 IST

మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శ
మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలు చేయాలని డిమాండ్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్‌ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, 190 రోజులు దాటినా ఆచరణలో విఫలమైందని ఆరోపించారు. పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రకాల పింఛన్లు పెంచితే, ఒడిశా సీఎం మాఝీ వరి మద్దతు ధర క్వింటాకు రూ.3,100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా.. వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు(13 హామీలు) అమలు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని