రైతన్నకు అండగా ఉంటాం: వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రైతన్నకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

Published : 15 Jun 2024 05:36 IST

విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రైతన్నకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ‘‘ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి పాటుపడతా. వైకాపా ప్రభుత్వం వ్యవసాయశాఖను భ్రష్టుపట్టించింది. ఈ అయిదేళ్లు ఆ శాఖ అభివృద్ధికి పాటుపడతా. కర్షకుల ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తాం. తెదేపా హయాంలో రాయితీపై అందించిన యంత్రాలు, పరికరాలు, అమలైన పథకాల్ని మళ్లీ పునరుద్ధరిస్తాం. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తాను’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని