గృహ నిర్మాణాల పూర్తికి కృషి చేస్తాం: మంత్రి పార్థసారథి వెల్లడి

అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు.

Published : 15 Jun 2024 06:21 IST

అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైన 20.62 లక్షల గృహాల్లో 6.8 లక్షల మేర మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 13.8 లక్షల ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గత ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల.. కాలనీల్లో కేటాయించిన స్థలాలు, నిర్మాణాల విషయంలో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వీటిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించి, సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ పథకం కింద లబ్ధిదారుల చెల్లింపుల కోసం రూ.90 కోట్లు విడుదల చేస్తూ ఆయన దస్త్రంపై తొలి సంతకం చేశారు. తనకు మంత్రిగా అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని