ముమ్మరంగా పని చేయాలని అమిత్‌షా చెప్పారు

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన వేదికపై కేంద్ర మంత్రి అమిత్‌షా.. తమిళనాడు భాజపా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైరల్‌ అయిన వీడియోలపై ఆమె  స్పందించారు.

Published : 15 Jun 2024 05:37 IST

వైరల్‌ అయిన వీడియోపై తమిళిసై వివరణ 

చెన్నై, న్యూస్‌టుడే: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన వేదికపై కేంద్ర మంత్రి అమిత్‌షా.. తమిళనాడు భాజపా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైరల్‌ అయిన వీడియోలపై ఆమె  స్పందించారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా అమిత్‌షాను ఆ వేదికపై కలిశాను. ఫలితాల తర్వాత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్లపై తెలుసుకోవడానికి ఆ సందర్భంగా అమిత్‌షా నన్ను పిలిచారు. వాటిని వివరించేటప్పుడు.. ఆయన నాకు కొన్ని సూచనలు చేశారు. రాజకీయ, నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు. ఇది తెలియక కొందరు.. సామాజిక మాధ్యమాల్లో అనవసర ఊహాగానాలకు తెరతీశారు’ అని ‘ఎక్స్‌’లో ఆమె వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని