దేశవిదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 15 Jun 2024 05:38 IST

రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విదేశాల్లో స్థిరపడ్డ ఆంధ్రుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

 సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఫ్యాప్సియా

రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రత్యేకంగా మంత్రిని నియమించడంతో వాటి బాగోగులను పట్టించుకునే అవకాశం ఏర్పడుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ (ఫ్యాప్సియా) అధ్యక్షుడు వాసిరెడ్డి మరళీకృష్ణ పేర్కొన్నారు. ‘చిన్న రాష్ట్రాల్లోనూ ఎంఎస్‌ఎంఈల కోసం సెక్రటరీ స్థాయి అధికారి ఉన్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దశాబ్దం తర్వాత చిన్న పరిశ్రమల నిర్వాహకుల కోరికను చంద్రబాబు మన్నించారు. వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇందుకు కృతజ్ఞతలు. దీనివల్ల రాష్ట్రంలో అవి బలోపేతం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు భారీ పరిశ్రమలకే శాఖలో ప్రాధాన్యముంది’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని