శాసనమండలి వద్దన్న వారికే.. నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది

శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్‌ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు.

Published : 15 Jun 2024 05:48 IST

జగన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్‌ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అడిగినా, అడగకపోయినా వాళ్ల అవసరాల కోసం రాజ్యసభలో మద్దతిస్తారని వైకాపా ఎంపీలను ఉద్దేశించి ఆయన విమర్శించారు. స్పీకర్‌తోపాటు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని, ఇవ్వకపోయినా తన బాధ్యత నిర్వర్తిస్తానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని