జగన్‌పై చర్యలు తప్పవు: గోరంట్ల

వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 15 Jun 2024 05:52 IST

రాజమహేంద్రవరం(టి.నగర్‌), న్యూస్‌టుడే: వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి మొదలు దోచుకున్న అధికారుల జాబితా వెలికితీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన విధంగా సూపర్‌-6 పథకాలను తప్పకుండా అమలు చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమంలో లోటు చేయరని, అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించానని, పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని