పుంగనూరులో ఉద్రిక్తత.. పెద్దిరెడ్డి గోబ్యాక్‌ అంటూ తెదేపా కార్యకర్తల ర్యాలీ

చిత్తూరు జిల్లా పుంగనూరులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావడానికి వీల్లేదంటూ తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Published : 16 Jun 2024 06:36 IST

ఎన్టీఆర్‌ కూడలిలో గుమికూడిన నిరసనకారులు 

పుంగనూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పుంగనూరులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావడానికి వీల్లేదంటూ తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్దిరెడ్డి పట్టణంలో పర్యటిస్తారనే సమాచారంతో తెదేపా కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. పార్టీ నాయకులు మాధవరెడ్డి, దేశాది ప్రకాష్, శ్రీకాంత్‌ మాట్లాడుతూ గతంలో చంద్రబాబును పుంగనూరుకు రావొద్దంటూ వైకాపా నాయకులు నిరసన తెలిపారని, కుప్పంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని వారు ఆరోపించారు. అనంతరం అంబేడ్కర్‌ కూడలి నుంచి ఇందిరా కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పీకేఎం ఉడా మాజీ ఛైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ఇంటిపైకి నిరసనకారులు దూసుకెళ్లారు. మరికొందరు రాళ్లు రువ్వారు. సీఐ రాఘవరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని, నిరసనకారులను అక్కడి నుంచి పంపేశారు. ఈ గొడవ నేపథ్యంలో పెద్దిరెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

  • మండలంలోని ఈడిగపల్లె వద్ద మాజీ ఎంపీపీ నరసింహులుపై అదే ప్రాంతానికి చెందిన కొందరు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.
  • తన ఇంటిపైకి రాళ్లు రువ్వి తనను హతమార్చడానికి యత్నించిన న్యాయవాది నవీన్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని పీకేఎం ఉడా మాజీ ఛైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ డిమాండు చేశారు. ఘటన అనంతరం ఆయన మాట్లాడారు. నవీన్, ఎల్వీ రమణ, ఉమేష్‌లపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని