తప్పు చేయకపోతే... కమిషన్‌ ముందు నిరూపించుకోవచ్చు కదా?

విద్యుత్‌ కొనుగోలులో తప్పు చేయకపోతే కమిషన్‌ ముందు హాజరై నిరూపించుకోవచ్చు కదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

Published : 16 Jun 2024 06:19 IST

మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: విద్యుత్‌ కొనుగోలులో తప్పు చేయకపోతే కమిషన్‌ ముందు హాజరై నిరూపించుకోవచ్చు కదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. చేసిన తప్పిదాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయని, శిక్ష పడుతుందనే భయం ఆయనలో మొదలైందని కమిషన్‌కు రాసిన 12 పేజీల లేఖ ద్వారా తెలుస్తుందన్నారు. విద్యుత్‌ కొనుగోలు పెద్ద కుంభకోణమని, అందులో జరిగిన అక్రమాలన్నీ బయటకు రావాలన్నారు. అవినీతి జరగకపోతే జస్టిస్‌ నరసింహారెడ్డి ముందు హాజరై తన తప్పిదం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. తెలంగాణ వాళ్లను విచారిస్తారా అంటూ మళ్లీ సెంటిమెంట్‌ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కమిషన్‌కు రాసిన లేఖ ద్వారా కేసీఆర్‌ డొల్లతనం బయటపడిందన్నారు. పదేళ్ల భారాస పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ విచారణకు సహకరించాలని మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని