కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కూలడం తథ్యం: ఖర్గే

‘సంపూర్ణ ఆధిక్యం లేకుండానే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. పొరపాటున ఏర్పాటైన ఈ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చ’ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

Published : 16 Jun 2024 06:44 IST

ఈనాడు, బెంగళూరు: ‘సంపూర్ణ ఆధిక్యం లేకుండానే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. పొరపాటున ఏర్పాటైన ఈ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చ’ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ...మెజార్టీ లేకుండా ఏర్పాటయ్యే కిచిడీ ప్రభుత్వాలు ఏ క్షణంలోనైనా కూలిపోతాయంటూ ‘ఇండియా’ కూటమిని ఉద్దేశించి  ప్రధాని మోదీ పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మోదీ వ్యాఖ్యనే తానిప్పుడు గుర్తు చేస్తున్నానని ఓ ప్రశ్నకు ఖర్గే బదులిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం స్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటానని తెలిపారు. ఖర్గే వ్యాఖ్యలపై జేడీయూ నేత కె.సి.త్యాగి స్పందిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇలాంటి మాటలతో సందిగ్ధ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2014 నుంచీ ఎన్డీయే కూటమి మెజార్టీ సాధిస్తోందని తెలిపారు. ఇండియా కూటమికి నేత కానీ, స్పష్టమైన విధానం కానీ లేకపోవడాన్ని గుర్తించాలన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయటమే ‘ఇండియా’ కూటమిలో అంతా సవ్యంగా లేదన్న సంకేతాలిచ్చిందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని