అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీయేకు అధికారం ఖాయం

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీయే) సాధించిన విజయం ఆరంభం మాత్రమేనని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

Updated : 16 Jun 2024 06:33 IST

శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీయే) సాధించిన విజయం ఆరంభం మాత్రమేనని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన (యూబీటీ)తో కూడిన ఎంవీయే 30 సీట్లను సొంతం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన (రెబల్‌) విశాల్‌ పాటిల్‌ కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో ఈ కూటమి 31 స్థానాలను గెలుచుకున్నట్లయ్యింది. భాజపా, శివసేన (శిందే), ఎన్సీపీ(అజిత్‌పవార్‌)తో కూడిన మహాయుతి కూటమి 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంవీయే భాగస్వామ్య పక్ష నేతలు శరద్‌పవార్‌ (ఎన్సీపీ-ఎస్పీ), పృథ్వీరాజ్‌ చవాన్‌ (కాంగ్రెస్‌)తో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

మోదీ.. మీకు కృతజ్ఞతలు: శరద్‌ పవార్‌

 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ రోడ్‌ షోలు నిర్వహించిన నియోజకవర్గాల్లో ఎంవీయే విజయ కేతనం ఎగురవేసిందని ఎన్సీపీ (ఎస్పీ) నేత శరద్‌ పవార్‌ తెలిపారు. ‘అందుకే ప్రజలతో పాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోదీకి ధన్యవాదాలు’ అని ఆయన తెలిపారు. శివసేన, ఎన్సీపీల్లో చీలికల సందర్భంగా తమను వీడిన ఫిరాయింపుదారులను తిరిగి పార్టీల్లోకి చేర్చుకునేది లేదని శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రే తేల్చిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు