జగన్‌ది నీచ రాజకీయం: మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌

ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్‌.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు.

Published : 16 Jun 2024 06:44 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్‌.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమిపై అనుమానాలు ఉన్నా వాటికి ఆధారాలు లేవంటూ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. మంగళగరిలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టి ప్రతిపక్షం లేకుండా చేయాలని జగన్‌ కుట్ర పన్నారు. ఇప్పుడు ఆయనకు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంలపై లేని అనుమానాలు ఇప్పుడెందుకు?’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు