సీఎంఓ నిధులతో కొన్న ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి జగన్‌ అప్పగించరా?

ప్రభుత్వ సొమ్ముతో మాజీ సీఎం జగన్‌కు తాడేపల్లి, లోటస్‌పాండ్‌లలో ఉన్న ప్యాలెస్‌ల కోసం కొన్న ఫర్నిచర్‌ను ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు.

Published : 17 Jun 2024 04:26 IST

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ సొమ్ముతో మాజీ సీఎం జగన్‌కు తాడేపల్లి, లోటస్‌పాండ్‌లలో ఉన్న ప్యాలెస్‌ల కోసం కొన్న ఫర్నిచర్‌ను ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు. ఈ ఫర్నిచర్‌ కోసం సీఎంఓ ఖాతాల్లోని రూ.50 కోట్లు వాడుకున్నారని మండిపడ్డారు. ఏ తప్పూ చేయకపోయినా మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్‌ను వేధించిన వైకాపా వాళ్లు.. ప్రభుత్వ నిధులతో కొన్న ఫర్నిచర్‌ను వాడుకుంటూ నీతులు చెబుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైకాపా నేతల వేధింపుల వల్లే నాడు కోడెల శివప్రసాద్‌ చనిపోయారు. ఫర్నిచర్‌  తీసుకెళ్లాలని అప్పటి స్పీకర్‌కు ఆయన రెండుసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా తప్పుడు కేసులు పెట్టారు’’ అని అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్‌ను ఇప్పటికైనా జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించాలి’’ అని అనగాని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు