వైఎస్సార్‌ కుమార్తెగా గర్విస్తున్నా: షర్మిల

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె అయినందుకు తాను గర్విస్తున్నానని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రిని ఉద్దేశిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

Published : 17 Jun 2024 04:26 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె అయినందుకు తాను గర్విస్తున్నానని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రిని ఉద్దేశిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘మీ పట్టుదల, పోరాట పటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దారు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యానిచ్చారు. మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచారు. ప్రజల కోసం పాటుపడే మీ ఓర్పు, నిబద్ధతను వారసత్వంగా చేసుకుని ముందుకు సాగుతున్నా’ అని షర్మిల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని