భాజపా, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు: చిదంబరం

తమిళనాడులో 10న విక్రవందీ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో విమర్శల వేడి మొదలైంది. ఈ ఎన్నిక కోసం భాజపా, అన్నాడీఎంకే రహస్య పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం ఆరోపించారు.

Published : 17 Jun 2024 06:39 IST

చెన్నై: తమిళనాడులో 10న విక్రవందీ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో విమర్శల వేడి మొదలైంది. ఈ ఎన్నిక కోసం భాజపా, అన్నాడీఎంకే రహస్య పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం ఆరోపించారు. ‘పై నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని అన్నాడీఎంకే నిర్ణయించుకుంది. ఎన్డీయే భాగస్వామి పట్టాలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) రూపంలో భాజపా, అన్నాడీఎంకే కలిసే పోరాడనున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంకేపై డీఎంకే అభ్యర్థి గెలుపొందేలా ఇండియా కూటమి పనిచేయాలి’ అని ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. విక్రవందీ నుంచి పీఎంకే ఉపాధ్యక్షుడు సి.అన్బుమణి పోటీ చేయనుండగా.. డీఎంకే నుంచి అన్నియుర్‌ శివ నిలబడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని